పూరీ జగన్నాద్ ఆలయంలో రత్నభాండాగారం లెక్కింపు నిలిపివేత

by Mahesh |   ( Updated:2024-07-14 12:57:24.0  )
పూరీ జగన్నాద్ ఆలయంలో రత్నభాండాగారం లెక్కింపు నిలిపివేత
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఎన్నో వింతలు కలిగి ఉన్న శ్రీ జగన్నాథ ఆలయంలోని 'రత్న భండార్' (నిధి) దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు ఆదివారం తెరిచారు. ఒడిశా ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOPలు) అనుసరించి శ్రీ జగన్నాథ ఆలయ రత్నభండార్ తెరవబడింది. శనివారం, ఒడిశా ప్రభుత్వం అక్కడ నిల్వ చేసిన నగలతో సహా విలువైన వస్తువుల జాబితాను నిర్వహించిన తర్వాత రత్న భండార్ తెరవడానికి అనుమతి ఇచ్చింది. దీంతో అన్ని అనుమతుల నడుమ దాదాపు 40 సంవత్సరాల తర్వాత తెరిచిన రత్నభాండాగారం.. నగల లెక్కింపును కొద్ది సేపటికే అధికారులు మూసివేశారు. చీకటి పడటంతో కర్రపెట్టెల్లో ఉన్న ఆభరణాలను లెక్కించకుండానే.. లెక్కింపు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు.. రత్నభాండాగారం గదికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తాళం వేశారు. కాగా రేపు మరోసారి కమిటీ సమావేశమై ఆభరణాల లెక్కింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story