- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ గాంధీకి BIG షాక్.. ఈ సారి కొత్త నియోజకవర్గం నుంచి పోటీ
దిశ, తెలంగాణ బ్యూరో: కేరళలోని వయనాడ్ లోక్‌సభ సభ్యుడిగా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్‌గాంధీ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది కీలకంగా మారింది. ఈసారి ఆ స్థానం నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేసే అవకాశం లేదు. ‘ఇండియా’ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా వయనాడ్‌తో పాటు తిరువనంపురాన్ని కూడా సీపీఐకి కేటాయించినట్లు ఆ పార్టీ ప్రకటించింది. దీర్ఘకాలం పాటు అమేథీ నుంచి ప్రాతినిథ్యం వహించిన రాహుల్‌గాంధీ గత ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. వయనాడ్‌లో గెలిచి అమేథీలో ఓడిపోయారు. ప్రస్తుతం స్మృతి ఇరానీ అమేథీ ఎంపీగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో వయనాడ్ కూడా చేజారిపోవడంతో రాహుల్‌గాంధీ మరోసారి అమేథీకి వెళ్తారా?.. లేక కొత్తదాన్ని వెతుక్కుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. లేదా సీట్ల సర్దుబాటులో మార్పులు చేసి వయనాడ్ నుంచే మళ్లీ పోటీ చేసేలా కాంగ్రెస్‌కే ఆ సీటును కేటాయిస్తారా అనేది తేలాల్సి ఉన్నది.
ప్రస్తుతం కాంగ్రెస్ ఖాతాలో ఉన్న తిరువనంతపురం కూడా సీపీఐకి వెళ్ళిపోయింది. శశిథరూర్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ స్థానం నుంచే ఆయన బీజేపీ క్యాండిడేట్‌గా బరిలో నిలిచే అవకాశమున్నది. సీపీఐ ప్రకటన ప్రకారం వయనాడ్ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డీ.రాజా సహచరి అన్నీ రాజా పోటీ చేయనున్నారు. తిరువనంతపురంలో పణ్ణియన్ రవీంద్రన్ సీపీఐ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.