- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేఘాలయ సీఎంగా మళ్లీ ఆయనే.. ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరు!
అగర్తలా: మేఘాలయాలో అస్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కన్రాడ్ సంగ్మా ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ ఫగు చౌహన్ ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు 32 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు తెలిపారు. అయితే మద్దతిస్తున్న పార్టీల వివరాలు వెల్లడించలేదు. గవర్నర్ ను కలిసే ముందు సంగ్మా మీడియాతో మాట్లాడారు. మాకు స్పష్టమైన మెజారిటీ ఉంది. బీజేపీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది.
ఇతరులు కూడా అండగా ఉన్నారు’ అని తెలిపారు. గురువారం వెలువడిన ఫలితాల్లో ఎన్పీపీ 26 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ రెండు స్థానాలు గెలుచుకోగా, టీఎంసీ 5 స్థానాల్లో గెలుపొందింది. స్థానిక పార్టీ యూడీపీ 11 సీట్లు గెలుచుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. స్వతంత్ర ఎమ్మెల్యే కూడా సంగ్మాకు మద్దతిచ్చినట్లు చెప్పారు. ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు మేఘాలయ ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన సంగ్మాకు ప్రధాని అభినందనలు తెలిపారు.