- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గెలిచింది కాంగ్రెస్.. ఓడింది మోడీ
దిశ, తెలంగాణ బ్యూరో : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ అయినా ఓడిపోయింది మాత్రం ప్రధాని మోడీ అని ఎంపీ జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి స్వయంగా ప్రచారంలోకి దూకినందున ఇది ఆయన వ్యక్తిగత ఇమేజ్‌కు రిఫరెండం అని వ్యాఖ్యానించారు. ఆయనను కర్నాటక ప్రజలు తిరస్కరించారని కామెంట్ చేశారు. డబుల్ ఇంజన్ సర్కారు అంటూ ప్రధాని మోడీ, బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకున్నా కర్నాటకలో మాత్రం సామాజిక సామరస్యం-ఆర్థిక వృద్ధి అనే డబుల్ ఇంజన్‌కే ఓటు వేసి కాంగ్రెస్‌ను గెలిపించారని అన్నారు. ప్రధానమంత్రి స్వయంగా కర్నాటక ఎన్నికల ప్రచారానికి వచ్చి ప్రజల మధ్య విభజన తీసుకొచ్చే రాజకీయాలకు పాల్పడ్డారని, ఓటు బ్యాంకును పోలరైజ్ చేయడంమీద దృష్టి పెట్టారని, ఆయన ఎత్తుగడలన్నీ చిత్తయ్యాయన్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కారం చూపడంపై స్పష్టమైన హామీ ఇచ్చి ఎన్నికల బరిలోకి దిగామని, తమ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందనే నమ్మకంతోనే గెలిపించారని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం, రైతుల్లో నిరాశ, ఆహార భద్రత, ప్రజల జీవన సమస్యలు, విద్యుత్ సరఫరా తదితర సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టి ప్రజలకు హామీ ఇచ్చిందని, చివరకు వాటినే విశ్వసించారని అన్నారు. కర్నాటకకు చెందిన ఆయన పార్టీకి కమ్యూనికేషన్ ఇన్‌చార్జిగానూ ఉన్నారు.
Also Read...