- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్నాటక సీఎం ఎవరు.. ఎల్పీ భేటీలో రాత్రికల్లా ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు?
దిశ, తెలంగాణ బ్యూరో: కర్నాటకలో భారీ స్థాయి మెజారిటీని సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. అయితే ముఖ్యమంత్రి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. పీసీసీ చీఫ్‌గా రాష్ట్రమంతా పర్యటించి గెలుపు కోసం కష్టపడి పనిచేసిన డీకే శివకుమార్ అవుతారా?.. లేక రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రజాదరణ, తగిన అనుభవం ఉన్న నేతగా సిద్ధరామయ్య అవుతారా?.. ఇవీ కర్నాటకలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల్లోకి దిగిన కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఎవరికి సీఎం పగ్గాలు అప్పజెప్తుందనేది కీలకం. వీరిద్దరూ సీఎం రేసులో ఫ్రంట్ రన్నర్లుగా ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఈ రోజు సాయంత్రం తర్వాత బెంగళూరుకు చేరుకోనున్నారు. ఎల్పీ సమావేశంలో పార్టీ నేతను ఎన్నుకోనున్నారు.
రానున్న లోక్‌సభ ఎన్నికలకు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కీలకం కానున్నది. ఇక్కడి నుంచే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కథ నడిపించనున్నది. ఈ రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాంగ్రెస్ తక్షణ కర్తవ్యంగా మారింది. కర్నాటకలో బీజేపీ ఫేస్‌గా ఎడియూరప్పకు ఉన్నంత ఇమేజ్ కాంగ్రెస్ పార్టీలో సిద్ధరామయ్యకు ఉన్నది. సిద్దరామయ్య మాజీ ముఖ్యమంత్రిగా మాత్రమే కాక ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఐదేళ్ళ పాటు 2013 నుంచి స్థిరమైన పాలన అందించారన్న గుర్తింపు పార్టీ అగ్రనాయకత్వానికి ఉన్నది. పార్టీలో అత్యంత సీనియర్ లీడర్లలో ఒకరుగా, యాంటీ-బీజేపీ క్రూసేడర్‌గా ప్రజలు గుర్తిస్తున్నారు. ఇద్దరిలో ఎవరికి సీఎం బాధ్యతలు అప్పజెప్పినా అది పార్టీలో అసంతృప్తి, అసమ్మతి లేకుండా చేసుకోవడం పార్టీ నాయకత్వానికి కీలకమైన వ్యవహారం.
కర్నాటక అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క లోక్‌సభ స్థానాన్ని (డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్) మాత్రమే గెల్చుకున్నది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతిన్నది. దీంతో అప్పటి పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావ్ నైతిక బాధ్యతతో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వెంటనే డీకే శివకుమార్ పార్టీ పగ్గాలను చేపట్టారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారాన్ని సుస్థిరం చేయగలిగారు. పార్టీకి ఇద్దరూ రెండు కళ్ళుగా జాతీయ నాయకత్వం భావిస్తున్నందున ఎవరికి సీఎం బాధ్యతలు అప్పగిస్తుందనే ఉత్కంఠ నెలకొన్నది.
Read More... కాంగ్రెస్ను కింగ్ చేసిన కన్నడ రీజియన్స్ ఇవే