- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటకలో కాంగ్రెస్సే గెలుస్తుంది.. వీరప్ప మొయిలీ కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి కొన్ని వారాల్లో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పక గెలుస్తుందని జోస్యం చెప్పారు. కర్ణాటకలో అధికార మార్పిడి పవనాలు వీస్తున్నాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 130 స్థానాల్లో గెలుపు ఖాయమని చెప్పారు. అదే క్రమంలో బీజేపీ కనీసం 60 సీట్లు కూడా దాటదన్నారు. దీంతో దక్షిణాదిన బీజేపీకి తలుపులు మూసుకుపోతాయని అన్నారు. కాగా, కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమని తెలిపారు. ‘కాంగ్రెస్‌కు అనుకూలంగా పవనాలు వీస్తున్నాయి. బీజేపీ పూర్తిగా చితికిపోతుంది.
సీనియర్లకు టికెట్ నిరాకరించడంతో కాషాయ పార్టీలో యూనిటీ లోపించింది’ అని మొయిలీ అన్నారు. బొమ్మై ప్రభుత్వం 40 శాతం కమిషన్‌తో రాష్ట్రంలో విఫలమైందని తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ.. ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. మోడీ మంత్రం కర్ణాటకలో పనిచేయదని.. గతంలో తమిళనాడులో ప్రయత్నిస్తే విఫలమయ్యారని గుర్తు చేశారు. కేరళ, హిమచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ ఇదే రిపీట్ అయిందని తెలిపారు. సిద్ధరామయ్య, శివకుమార్ సీఎం పదవికి ఆశవాహులుగా ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానమే ముఖ్యమంత్రిని తేలుస్తుందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం 2024లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుకు మార్గమని చెప్పారు.