కాంగ్రెస్‌లో ముస్లింలను బానిసల్లా చూస్తున్నారు.. ఎంపీ కామెంట్స్

by Hajipasha |
కాంగ్రెస్‌లో ముస్లింలను బానిసల్లా చూస్తున్నారు.. ఎంపీ కామెంట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్‌‌లోని ఓ వర్గం నాయకులు ముస్లింలను బానిసల్లా చూస్తున్నారని ఆ పార్టీకి చెందిన అసోం ఎంపీ అబ్దుల్ ఖాలిక్ ఆరోపించారు. ముస్లింలకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి తనకు లోక్‌సభ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నో చెప్పడంతో ఖాలిక్ ఈ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామాను ప్రకటించారు. పై వ్యాఖ్యలతో కూడిన రాజీనామా లేఖను ఖాలిక్ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపారు. ‘‘కాంగ్రెస్ పార్టీ సమానత్వాన్ని విశ్వసిస్తుంది. అందుకే ముస్లింలు కాంగ్రెస్‌ను ప్రేమిస్తారు. కానీ ఆ పార్టీలోని కొందరు అహంకారపూరిత నాయకులు ముస్లింలను బానిసల్లా చూస్తున్నారు. దానివల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోంది’’ అని ఖాలిక్ పేర్కొన్నారు. ఇక అబ్దుల్ ఖాలిక్ అసోం గణ పరిషత్, టీఎంసీ పార్టీలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story