పెళ్లి చేసుకుంటానని ప్రకటించిన రాహుల్ గాంధీ.. అమ్మాయి ఎవరో తెలుసా?

by Javid Pasha |   ( Updated:2023-06-26 05:55:04.0  )
పెళ్లి చేసుకుంటానని ప్రకటించిన రాహుల్ గాంధీ.. అమ్మాయి ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రధాన కారణమని, దేశానికి కాబోయే పీఎం రాహుల్ గాంధీ అంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే రాజకీయంగా రాహుల్ గ్రాఫ్ మెరుగుపడుతున్నప్పటికీ ఆయన పెళ్లి విషయం మాత్రం పార్టీ నేతలు, కార్యకర్తలను అసంతృప్తికి గురి చేస్తోంది. అయితే తాజాగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ శ్రేణులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. దీనికి ఈ నెల 23న పాట్నాలో జరిగిన విపక్ష పార్టీ నేతల భేటీ వేదికైంది. ఈ భేటీకి పలువురు సీఎంలు, పార్టీ అధినేతలు హాజరయ్యారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి తమిళనాడు సీఎం స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, కాంగ్రెస్ పార్టీ అధినేత ఖర్గేతో పాటు పలు పార్టీల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు.

అయితే ఈ కార్యక్రమానికి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని అన్నారు. అక్కడే ఉన్న రాహుల్ ను ఉద్దేశించి.. ఇప్పటికే ఆలస్యమైంది.. ఇప్పటికైనా పెళ్లి చేసుకోవాలని సూచించారు. సోనియా గాంధీ కూడా రాహుల్ ను పెళ్లి చేసుకోవాలని పలుమార్లు కోరినట్లు సోనియా గాంధీ తనతో చెప్పారని లాలూ అన్నారు. దీనికి స్పందించిన రాహుల్.. తాను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని అందరి సమక్షంలో చెప్పారు. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో అనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతకు రాహుల్ పెళ్లి చేసుకునేది ఇండియన్ అమ్మాయా లేక ఫారిన్ కు చెందిన యువతినా అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. కాగా ప్రస్తుతం రాహుల్ గాంధీ వయసు 53 ఏళ్లు.

Advertisement

Next Story

Most Viewed