రాహుల్‌కు కాంగ్రెస్ మరో సీటు వెతకాల్సిందే: ప్రధాని మోడీ వ్యాఖ్యలు

by samatah |   ( Updated:2024-04-20 07:31:05.0  )
రాహుల్‌కు కాంగ్రెస్ మరో సీటు వెతకాల్సిందే: ప్రధాని మోడీ వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం పార్టీ మరో లోక్‌సభ నియోజకవర్గం వెతకాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కేరళలోని వయనాడ్ సెగ్మెంట్ నుంచి ప్రజలు రాహుల్‌ను తరిమి కొడతారని జోస్యం చెప్పారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో శనివారం జరిగిన ర్యాలీలో మోడీ ప్రసంగించారు. బీజేపీ నేత స్మృతీ ఇరానీ రాహుల్‌ను ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి తరిమికొట్టారని గుర్తు చేశారు. ఆయన త్వరలోనే వయనాడ్ నుంచి కూడా వెళ్లిపోవాల్సి ఉంటుందని తెలిపారు. తొలి దశ ఓటింగ్ పూర్తైన నేపథ్యంలో రాహుల్‌కు మరో సీటు వెతికే పనిలో కాంగ్రెస్ అధిష్టానం ఉందని భావిస్తున్నట్టు చెప్పారు. మొదటి దశ పోలింగ్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి దేశ ప్రజలు ఏకగ్రీవంగా ఓటు వేశారని దీమా వ్యక్తం చేశారు. 25 శాతం సీట్ల కోసం మాత్రమే ఇండియా కూటమి నేతలు పరస్పరం పోట్లాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికల తర్వాత ఇంకెలా ఉంటుందో అని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం పేదల కోసం ఏ పని చేసినా కాంగ్రెస్ ఎగతాళి చేస్తుందని మండిపడ్డారు.

Advertisement

Next Story