అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా..

by Vinod kumar |
అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా..
X

న్యూఢిల్లీ: తాజాగా దేశంలో సంచలనం సృష్టించిన అదానీ-హిండెన్ బర్గ్ నివేదికపై జాయింట్ పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ మరోసారి డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో నిజానిజాలు బయటపెట్టేందుకు దర్యాప్తు చేయాలని కోరుతూ దేశ వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. కేంద్రం నుంచి సరైన స్పందన లేకపోవడంతో అన్ని ప్రాంతాల్లో రాష్ట్ర కమిటీ లు మీడియా సమావేశాలు, జిల్లాలో నిరసన కార్యక్రమాలకు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

వచ్చే నెల 6 నుంచి 10 వరకు దేశవ్యాప్తంగా నిరసనలు తెలపనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ తర్వాత మార్చి 13న ఛలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చారు. దీంతో పాటు అన్ని రాష్ట్రాల రాజధానుల్లో కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే అధ్వర్యంలో ఏప్రిల్‌లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నట్లు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed