కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ

by GSrikanth |   ( Updated:2023-05-13 14:18:04.0  )
కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ కు ఆయన అభినందనలు తెలిపారు. కన్నడ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. కర్ణాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు చెప్పిన మోడీ.. బీజేపీ కార్యకర్తల కృషిని అభినందించారు. రాబోయే రోజుల్లో మరింత శక్తితో కర్ణాటకకు సేవ చేస్తామన్నారు. కాగా కాగా కర్ణాటకలో మరోసారి విజయం సాధించడం ద్వారా సౌత్ ఇండియాలో పార్టీని బలోపేతం చేసి తద్వారా 2024 లోక్ సభ ఎన్నికల్లో తిరుగులేని విధంగా సత్తా చాటాలని బీజేపీ భావించింది. ఈ మేరకు కర్ణాటకపై భారీ ఆశలు పెట్టుకుంది. ప్రధాని మోడీ సహా, అమిత్ షా, జేడీ నడ్డా వంటి ముఖ్యనేతలు వరుసగా కర్ణాటకలో పర్యటనలు, రోడ్డు షోలు నిర్వహించారు. అయినా రాష్ట్ర ప్రజల తీర్పు బీజేపీకి వ్యతిరేకంగా రావడంతో ఆ పార్టీలో నిరుత్సాహం నెలకొంది.

ఇవి కూడా చదవండి:

కర్ణాటకలో బీజేపీని భారీ దెబ్బకొట్టిన వ్యక్తి ఓటమి

Advertisement

Next Story