కర్ణాటకలో కాంగ్రెస్ విజయ దుందుభి

by Nagaya |   ( Updated:2023-05-13 10:13:02.0  )
కర్ణాటకలో కాంగ్రెస్ విజయ దుందుభి
X

దిశ, బెంగళూరు : కన్నడ కదనంలో రసవత్తర ఫలితం వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి కన్నడిగులు జై కొట్టారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలైనప్పటి నుంచే హస్తం పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. శనివారం మధ్యాహ్నం సమయానికి రాష్ట్రంలోని 135 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ మాత్రం 64 చోట్ల మాత్రమే లీడ్‌లో ఉంది. ఇక జేడీఎస్ 22 చోట్ల ముందంజలో ఉంది. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగి ప్రచారం చేసినా.. బీజేపీకి సానుకూల ఫలితం రాలేదు. ప్రతి పనికి 40 శాతం కమీషన్ నినాదంతో జనంలోకి వెళ్లిన కాంగ్రెస్‌కు అనూహ్య స్పందన వచ్చింది. బీసీలు, దళితులు, మైనార్టీలు ఉన్న ప్రాంతాలన్నీ కాంగ్రెస్ , జేడీఎస్ ఖాతాలోకి వచ్చి చేరాయి.

ఈ ఫలితాలపై సీఎం బస్వరాజ్ బొమ్మై స్పందిస్తూ.. ఓటమిని అంగీకరించారు. ప్రజలలోకి వెళ్లడంలో అంతగా విజయం సాధించలేకపోయామని తెలిపారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని ముందుకు పోతామని చెప్పారు. మరోవైపు కర్ణాటక వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. రేపు (ఆదివారం) కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఉంటుందని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ వెల్లడించారు. ఇవాళ సాయంత్రం కల్లా కాంగ్రెస్ ఎమ్మెలేలు బెంగళూరులోని హిల్టన్ హోటల్‌కు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Also Read... కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు.. ఫలితాలపై కుమారస్వామి కీలక వ్యాఖ్యలు

కర్ణాటక రిజల్ట్స్ : ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన బస్వరాజు బొమ్మై

Advertisement

Next Story

Most Viewed