- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొదలైన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు.. బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు..!
దిశ, డైనమిక్ బ్యూరో: 2024 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతోంది. ఛత్తీస్ గఢ్‌లోని రాయపూర్‌లో ఆ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అనంతరం జరుగుతున్న సమావేశాలు కావడంతో ఈ ప్లీనరీకి ప్రాధాన్యత ఏర్పడింది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తుల అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సమావేశంలో భాగంగా తొలిరోజు ఖర్గే అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ భేటీ అయింది. సాయంత్రం చేసే తీర్మానాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రేపు, ఎల్లుండి పలు తీర్మానాలను పార్టీ ఆమోదించనుంది. ఎల్లుండి జరిగే బహిరంగ సభతో ప్లీనరీ సమావేశాలు ముగియనున్నాయి. కాగా ఈ ప్లీనరీలో ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఖర్గేకు పూర్తి స్వేచ్ఛను కల్పించనున్నట్లు తెలుస్తోంది.