- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిందే.. కాంగ్రెస్ జాతీయ నేత షాకింగ్ స్టేట్‌మెంట్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి, విపక్ష కాంగ్రెస్‌కు మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది పరిస్థితి. ఇలాంటి తరుణంలో మోడీ సర్కార్‌పై కాంగ్రెస్ జాతీయ నేత శశి థరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనాకు భారత ప్రభుత్వం ఆశ్రయం ఇవ్వడాన్ని శశి థరూర్ ప్రశంసించారు. భారత్ 1971లోనూ బంగ్లాదేశ్ ప్రజలతో ఉందని.. ఎప్పటికీ ఉంటుందని అన్నారు. ‘షేక్ హసీనాకు మనం సాయం చేసి ఉండకపోతే అది దేశానికే అవమానకరంగా మారేది అని అభిప్రాయపడ్డారు.
మనతో స్నేహం చేసేందుకు అందరూ వెనకడుగు వేసేవారు అని చెప్పారు బంగ్లాదేశ్లోని ప్రస్తుత పరిస్థితులు ఇరుదేశాల మధ్య బంధంపై ప్రభావం చూపలేవని అన్నారు. మరోవైపు రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా చెలరేగిన అల్లర్లు బంగ్లాదేశ్‌లో ఇప్పటికీ చల్లారడం లేదు. ప్రధానమంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వంపై మొదలైన ఈ ఆందోళనలు.. ప్రభుత్వాన్ని కూలగొట్టి, షేక్ హసీనాను దేశం విడిచి పారిపోయేలా చేసినా.. బంగ్లాదేశ్‌లో మాత్రం రణరంగం కొనసాగుతూనే ఉంది. ఇక నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినా.. నిరసనలు మాత్రం ఆగడం లేదు.