చర్చకు ఓకే అంటారు.. కానీ మాట్లాడనీయరు: కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలా ఫైర్

by Javid Pasha |
చర్చకు ఓకే అంటారు.. కానీ మాట్లాడనీయరు: కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలా ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణదీప్ సూర్జేవాలా విరుచుకుపడ్డారు. మణిపూర్ ఘటనపై పార్లమెంట్ లో చర్చించాలని 68 విపక్ష ఎంపీలు నోటీసులు ఇచ్చినా దానిపై మాట్లాడటానికి కేంద్రం పారిపోతోందని అన్నారు. మణిపూర్ ఘటనపై చర్చిద్దామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతుంటారని, కానీ చర్చకు మాత్రం గంట కూడా సమయం ఇవ్వరని అన్నారు.

ఆ గంట సమయంలో మొత్తం అధికార పార్టీ సభ్యులే మాట్లాడుతారని స్పష్టం చేశారు. విపక్ష సభ్యులకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వరని, అలాంటప్పుడు చర్చ దేనికని నిలదీశారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ పార్లమెంట్ కు వచ్చి మణిపూర్ ఘటనపై మాట్లాడాలని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణదీప్ సూర్జేవాలా విరుచుకుపడ్డారు.యన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story