పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెప్తే కాంగ్రెస్ ఎగతాళి చేసింది: ప్రధాని మోడీ

by Mahesh |
పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెప్తే కాంగ్రెస్ ఎగతాళి చేసింది: ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కోవిడ్-19 సమయంలో పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెప్పినప్పుడు కాంగ్రెస్ తనను ఎగతాళి చేసిందని గుర్తు చేశారు. యోగా, ఆయుర్వేదం లేదా భారతీయ మసాలా దినుసులు కావచ్చు, వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ ఎప్పుడూ ఏమీ చేయలేదు. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చాక మేము ఈ విధానాన్ని మార్చాము, ”అని మోడీ అన్నారు. ఈ రోజు సాయంత్రం కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగియనుంది.

Advertisement

Next Story