'కాంగ్రెస్ లీడర్లకు మైండ్ దొబ్బింది'.. ఆయని ఎంత తిడితే కమలం అంత బాగా వికసిస్తుంది : అమిత్ షా

by Vinod kumar |   ( Updated:2023-04-28 14:11:42.0  )
కాంగ్రెస్ లీడర్లకు మైండ్ దొబ్బింది.. ఆయని ఎంత తిడితే కమలం అంత బాగా వికసిస్తుంది : అమిత్ షా
X

నావల్ గుండ్ (కర్ణాటక): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ "విష సర్పం" అంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ లీడర్లకు మైండ్ దొబ్బిందని కామెంట్ చేశారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా నావల్‌గుండ్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు.

ప్రపంచం మొత్తం ప్రధాని మోడీని పొగుడుతుంటే కాంగ్రెస్ మాత్రం విష సర్పం అంటూ పిలుస్తున్నదంటూ అమిత్ షా నిప్పులు చెరిగారు. మోడీని ఎంత తిడితే కమలం అంత బాగా వికసిస్తుందని అన్నారు. ‘‘కాంగ్రెస్ లీడర్లకు మాట్లాడటానికి ప్రజా సమస్యలు కనిపించడం లేదు. గత తొమ్మిదేళ్లలో ప్రధాని మోడీ ప్రపంచంలో భారతదేశం యొక్క గౌరవాన్ని పెంచారు.

మౌలిక సదుపాయాలను బలోపేతం చేశారు. దేశ సరిహద్దులను సురక్షితం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మోడీ ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రజలు ‘మోడీ -మోడీ’ నినాదాలతో స్వాగతం పలుకుతున్నారు’’ అని అమిత్ షా అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ .. మోడీ తేరీ ఖబర్ ఖుదేగీ (మోదీ, మీ సమాధి తవ్వబడుతుంది) అనే నినాదాన్నిఇస్తోంది.

ప్రధానమంత్రి మోడీని ‘మౌత్ కా సౌదాగర్ (మరణాల వ్యాపారి)’ అని సోనియా గాంధీ అంటే.. ‘నీచీ జాతి కే లోగ్ (అధో స్థాయి ప్రజలు)’ అని ప్రియాంక గాంధీ అన్నారు. ఇప్పుడు మిస్టర్ ఖర్గే 'విషీలా సాంప్' (విషపూరిత పాము) అని చెప్పారు’’ అమిత్ షా పేర్కొన్నారు.

ఇక కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా ఖర్గే వ్యాఖ్యలపై మండిపడ్డారు. కాంగ్రెస్ నిరాశతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని, భారత్ పై వీరంతా దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ ఆదేశాల మేరకే కాంగ్రెస్ నేతలు ఇలా చేస్తున్నారన్నారు. భారత్‌ను నాశనం చేయాలనుకుంటున్న పాకిస్తాన్, చైనాలకు సోనియా గాంధీ ఏజెంట్ అని బీజేపీ ఎమ్మెల్యే బసన గౌడ చేశారు.

గురువారం కర్ణాటకలోని కలబురగిలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారు. తాను మోడీని వ్యక్తిగతంగా విమర్శించలేదని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు విషపూరితం అని మాత్రమే అన్నానని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాకరేపుతున్నాయి.

Also Read..

విప్లవాత్మక మార్పులు తెస్తుంది.. ఎఫ్ఎం ట్రాన్స్‌మిటర్ల ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ

1977 నుంచి ఇప్పటివరకు ఏప్రిల్-28 న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలివే..

Advertisement

Next Story