రాహుల్‌గాంధీ ‘ఒక్క ఓటు’ ట్వీట్ వైరల్

by Hajipasha |
రాహుల్‌గాంధీ ‘ఒక్క ఓటు’ ట్వీట్ వైరల్
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటుశక్తి గురించి తెలుపుతూ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ప్రజలను ఆలోచింపజేసే ట్వీట్ చేశారు. ‘‘ఒక్క ఓటు’’ అనే పదాన్ని ప్రాస కోసం వాడుతూ.. భవిష్యత్తులో ఇండియా కూటమి సర్కారు ఏర్పడితే ప్రజల కోసం ఏమేం చేస్తారనేది సూటిగా సుత్తిలేకుండా ఆయన చెప్పేశారు.

‘‘దేశవ్యాప్తంగా జరుగుతున్న భయంకరమైన భేదభావాలు, అన్యాయాన్ని నిర్మూలించేందుకు మీ ఒక్క ఓటు చాలు. ఆగస్టు 15 నాటికి 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు కావాలంటే మీ ఒక్క ఓటు చాలు. జులై 1 నుంచి నిరుపేద మహిళల బ్యాంకు ఖాతాల్లో ప్రతినెలా రూ.8500 జమకావాలంటే.. మీ ఒక్క ఓటు చాలు. ఫ్రెషర్లకు ఏటా లక్ష తొలి ఉద్యోగాలు దొరకాలంటే.. మీ ఒక్క ఓటు చాలు. మీకు అధికారమిచ్చే రాజ్యాంగానికి రక్షణ లభించాలంటే.. మీ ఒక్క ఓటు చాలు. ప్రభుత్వాన్ని ఎన్నుకునే మీ అధికారాన్ని కాపాడి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే..మీ ఒక్క ఓటు చాలు. అణగారిన వర్గాల వారికి అన్ని రంగాల్లో భాగం దొరకాలంటే, రిజర్వేషన్లకు రక్షణ లభించాలంటే..మీ ఒక్క ఓటు చాలు. జల్, జంగల్, జమీన్‌లపై ఆదివాసీలు అధికారాన్ని కొనసాగించాలంటే.. మీ ఒక్క ఓటు చాలు. ఇండియా కూటమిలోని పార్టీలకు వేసే ప్రతీ ఓటు దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. పౌరుల వికాసానికి బాటలు పరుస్తుంది’’ అని రాహుల్‌గాంధీ తన ట్వీట్‌లో ప్రస్తావించారు.

Advertisement

Next Story