రేపు జైలు నుంచి విడుదల కానున్న సిద్దూ

by Javid Pasha |   ( Updated:2023-03-31 09:43:43.0  )
రేపు జైలు నుంచి విడుదల కానున్న సిద్దూ
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత, వెటరన్ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దూ రేపు జైలు నుంచి విడుదల కానున్నారు. 34 ఏళ్ల క్రితం కారు పార్కింగ్ విషయంలో తలెత్తిన ఓ గొడవకు సంబంధించిన కేసులో ఏడాది జైలు శిక్ష పూర్తి చేసుకున్న సిద్దూ రేపు విడుదల అవుతున్నట్లు సిద్దూ అధికారిక ట్విట్టర్ లో తెలిపారు. ఇదే విషయాన్ని సిద్దూ లాయర్ హెచ్పీఎస్ వర్మ ధృవీకరించారు. 1988, డిసెంబర్ 27న కారు పార్కింగ్ విషయంలో గుర్నామ్ సింగ్ (65) అనే వ్యక్తితో సిద్దూ, ఆయన ఫ్రెండ్ రూపీందర్ సింగ్ గొడవ పడ్డారు. గుర్నామ్ సింగ్ ను కారు బయటకు లాగి తీవ్రంగా కొట్టారు.

దీంతో తీవ్ర గాయాలైన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబ సభ్యులు సిద్దూపై కేసు పెట్టారు. వ్యక్తిపై దాడికి పాల్పడి చావుకు కారణమయ్యారంటూ సిద్దూపై కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే గతేడాది ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. సిద్దూను దోషిగా తేలుస్తూ ఏడాది జైలు శిక్ష విధించింది. కాగా గతేడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి సిద్దూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed