Jairam Ramesh: 'బీజేపీ ప్రభుత్వానికి ఉన్న ఇద్దరు సోదరులు వీళ్లే'

by Javid Pasha |   ( Updated:2022-09-04 11:43:02.0  )
Jairam Ramesh: బీజేపీ ప్రభుత్వానికి ఉన్న ఇద్దరు సోదరులు వీళ్లే
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకు మరింత ఉద్రిక్తం అవుతోంది. ఆరోపణలు, విమర్శలతో రెండు పార్టీల మధ్య రాజకీయ వేడి పెరిగిపోతోంది. అయితే ఆదివారం ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ ప్రారంభం ముందు జైరాం రమేష్ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. మోడీ ప్రభుత్వానికి ఇద్దరు సోదరులు ఉన్నారంటూ చురకలంటించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం రెండు మోడీ ప్రభుత్వానికి ఉన్న ఇద్దరు సోదరులంటూ జైరాం విమర్శించారు. 'దేశంలో ప్రజలు తమ వెన్ను విరిచే ద్రవ్యోల్బణం, నిరోద్యంతో ఎంతో ఇవ్వండి పడుతున్నారు. కాబట్టి వారికి పరిష్కారాలు చూపాలని మోడీ ప్రభుత్వానికి మేము సందేశం ఇవ్వాలనకుంటున్నాం' అని ఆయన అన్నారు.

Advertisement

Next Story