- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూసీసీపై కాంగ్రెస్ ఆంతరంగిక సమావేశం
న్యూఢిల్లీ : యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఆంతరంగిక సమావేశం నిర్వహించింది. ఇందులో హస్తం పార్టీ సీనియర్ నేతలు పి.చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్, వివేక్ తన్‌ఖా, కేటీఎస్ తులసి, మనీశ్ తివారీ, ఎల్ హనుమంతయ్య, అభిషేక్ మను సింఘ్వి పాల్గొన్నారు. అయితే ఈ మీటింగ్ ముగిసిన అనంతరం వెళ్లిపోయే క్రమంలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేటీఎస్ తులసి మీడియాతో మాట్లాడారు. యూసీసీపై ఈ సమావేశంలో ఏమి తేల్చ లేదని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం యూసీసీ డ్రాఫ్ట్ బిల్లును విడుదల చేసిన తర్వాత.. దాన్ని స్టడీ చేసి తమ పార్టీ వైఖరిని ప్రకటిస్తామని తెలిపారు. కాంగ్రెస్ నేత మనీష్ తివారీ బీజేపీపై విరుచుకుపడ్డారు. "ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో దేశ ప్రజల మధ్య చీలికను సృష్టించేందుకు యూనిఫాం సివిల్ కోడ్ ను కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చింది" అని తివారీ విమర్శించారు. మరోవైపు ప్రతిపాదిత యూసీసీని శిరోమణి అకాలీ దళ్ వ్యతిరేకించింది. ఇది దేశ ప్రయోజనాలకు తగినది కాదని పేర్కొంటూ లా కమిషన్‌కు లేఖ రాసింది.