పీసీసీ రద్దు.. ఖర్గే సంచలన నిర్ణయం

by Rani Yarlagadda |
పీసీసీ రద్దు.. ఖర్గే సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: జాతీయపార్టీ కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ లో (Himachal Pradesh) పీసీసీ (Pradesh Congress Committee) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పీసీసీ యూనిట్ తో పాటు జిల్లా, బ్లాక్ కమిటీలను రద్దుకు.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (AICC) ఆమోదం తెలిపారు. తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించారు.

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ యూనిట్ రద్దు అనంతరం.. మంత్రి అనిరుధ్ సింగ్ (Anirudh Singh) మాట్లాడుతూ.. త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ ను నియమిస్తామని తెలిపారు. ఇదొక సాధారణ చర్యేనన్న ఆయన.. ఆయా యూనిట్ల పదవీకాలం ముగియడంతో రద్దు చేయాలని చాలా కాలంగా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారని, అందుకు రద్దు చేశామని వివరించారు. హైకమాండ్ కు హిమాచల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభాసింగ్ లేఖ రాయగా.. దానిపై అధిష్టానం సానుకూలంగా స్పందించిందన్నారు.

Advertisement

Next Story