బ్రేకింగ్: అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. మాజీ CM పోటీ అక్కడినుండే..!

by Satheesh |
బ్రేకింగ్: అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. మాజీ CM పోటీ అక్కడినుండే..!
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ దూకుడు పెంచింది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న హస్తం పార్టీ.. ఎన్నికలకు మరింత సమయం ఉండగానే అభ్యర్థులను ఖరారు చేసింది. శనివారం 124 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇందులో కర్నాటక కాంగ్రెస్ కీలక నేతలకు కూడా నియోజకవర్గాలను ఖరారు చేసింది. కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌లు పోటీ చేసే స్థానాలను ఫిక్స్ చేసింది. మాజీ సీఎం సిద్ధరామయ్య వరుణ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతుండగా.. డీకే శివ కుమార్ కనకపుర నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు.



Next Story