మోదీ జీ.. ఆ విషయం జోక్ కాదు!

by GSrikanth |
మోదీ జీ.. ఆ విషయం జోక్ కాదు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: డిప్రెషన్, సూసైడ్‌లు నవ్వుకునే విషయం కాదని ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు మండిపడ్డారు. రిపబ్లిక్ సమ్మిట్ లో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమ్మిట్ లో మోడీ ప్రసంగిస్తూ ఓ ప్రోఫెసర్ కూతురు తాను చనిపోతున్నానంటూ లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని. ఆ స్లిప్ చూసిన తండ్రి ప్రొఫెసర్ నైన తన కూతురు ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్ రాయడంపై కోపగించుకుంటాడని మోడీ చెప్పారు.

దీంతో ఆ సమావేశంలో ఉన్నవారంతా నవ్వువుతున్న వీడియోను రాహుల్ గాంధీ ట్యాగ్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఆత్మహత్యల కారణంగా వేలాది మంది కుటుంబాలు తమ పిల్లల్ని కోల్పోతున్నారని ఇలాంటి విషయాన్ని ప్రధాని హేళన చేయడం సరికాదని విమర్శించారు. మోడీ వ్యాఖ్యలపై ప్రియాంకా గాంధీ రియాక్ట్ అవుతూ ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2021 లో 164033 భారతీయులు ఆత్మహత్యకు పాల్పడ్డారని వీరిలో అధిక శాతం మంది 30 ఏళ్ల లోపువానని ఇది ఓ విషాదం, జోక్ కాదని మండిపడ్డారు. ప్రధాని చెప్పిన విషయంపై నవ్వుకున్నవారు తమను తము సరి చేసుకోవాలన్నారు. మానసిక ఆరోగ్య సమస్యలను, ఈ సున్నితమైన అంశంపై ఎగతాళి చేయడం కంటే అవగాహన కల్పించాలని అన్నారు.



Advertisement

Next Story