హైదరాబాద్‌కు మారుతోన్న కన్నడ పాలిటిక్స్.. స్టార్ హోటల్స్‌లో రూమ్స్ బుకింగ్!

by Satheesh |   ( Updated:2023-05-13 04:42:23.0  )
హైదరాబాద్‌కు మారుతోన్న కన్నడ పాలిటిక్స్.. స్టార్ హోటల్స్‌లో రూమ్స్ బుకింగ్!
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగుతుండగానే అన్ని పార్టీలు అప్రమత్తం అవుతున్నాయి. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఇప్పటి నుండే క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ చేశాయి. కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోన్న వేళ కన్నడ రాజకీయం హైదరాబాద్‌కు మారుతోంది. నగరంలోని ప్రముఖ హోటల్స్‌లో కర్నాటక వ్యక్తులు పెద్ద ఎత్తున రూమ్స్ బుక్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ, నోవాటెల్, పార్క్ హయత్ హోటల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్ బల్క్‌గా రూమ్స్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఇక, గెలిచిన ఎమ్మెల్యేలందరిని ఇక్కడకి తరలించనున్నట్లు సమాచారం.

Also Read...

కర్నాటక రిజల్ట్: బీజేపీకి షాక్.. 8 మంది మంత్రులు వెనుకంజ!

Advertisement

Next Story