కాంగ్రెస్ లూట్ ఈస్ట్ పాలసీని, బీజేపీ యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చింది: ప్రధాని మోడీ

by S Gopi |
కాంగ్రెస్ లూట్ ఈస్ట్ పాలసీని, బీజేపీ యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చింది: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి కాంగ్రెస్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. బుధవారం త్రిపుర రాజధానిలో జరిగిన ఎన్నికల ర్యాలీ సందర్భంగా మాట్లాడిన మోడీ, కాంగ్రెస్ పార్టీ 'లూట్(దోపిడీ) ఈస్ట్ విధానాన్ని అవలంభించగా, బీజేపీ దాన్ని యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చిందని అన్నారు. త్రిపుర బీజేపీ ప్రభుత్వ హయాంలో మార్గదర్శకమైన పరివర్తనను చూసింది. దేశంలో పేదల కోసం మూడు కోట్ల కొత్త ఇళ్లను నిర్మించాలని తమ ప్రభుత్వం నిర్ణయించింది. త్రిపుర ప్రజలు సైతం ప్రయోజనం పొందనున్నట్టు మోడీ తెలిపారు. 500 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత రామ్ లల్లా ఎట్టకేలకు అయోధ్యలోని సొంత ఆలయంలో జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కనెక్టివిటీని పెంచడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో హైవేల రూపురేఖలు మార్చేందుకు రూ. 3 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్టు మోడీ వెల్లడించరు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ టవర్లు సరిగా పనిచేసేవి కాదు. కానీ ఇప్పుడు 5జీ కనెక్టివిటీ లభిస్తోంది. మొబైల్ బిల్లులను నెలకు రూ. 400-500కి తగ్గించింది మోడీ ప్రభుత్వమే. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రజల మొబైల్ బిల్లులు రూ. 4,000 నుంచి రూ. 5,000 అయ్యేవని కాంగ్రెస్‌ను విమర్శించారు.

Advertisement

Next Story