- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
హిందీలో కాదు.. కన్నడలో మాట్లాడు.. ప్రయాణికుడిని దూషించిన కండక్టర్
దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక రాజధాని బెంగుళూరు సిటీ బస్సులో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. బస్ టికెట్ తీసుకున్న ప్రయాణికుడు తనకు రావాల్సిన చిల్లర గురించి బస్ కండక్టర్ ను హిందీలో అడిగాడు. హిందీలో మాట్లాడటంపై తీవ్ర అభ్యంతరం తెలిపిన కండక్టర్ చిల్లర లేదని, ఉన్నా ఇవ్వనని మొండికేశాడు. అంతటితో ఆగకుండా హిందీలో ఎందుకు మాట్లాడుతున్నావని ఆగ్రహించిన కండక్టర్, కన్నడంలోనే మాట్లాడాలని ఆ ప్రయాణికున్ని దూషించాడు. సదరు ప్రయాణికుడు, కండక్టర్ మాటా మాటా అనుకోగా.. చివరికి ఇరువురు ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ఈ ఘటనను వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. బస్ కండక్టర్ తీరుపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం తమ రాష్ట్రంలో కన్నడ మాత్రమే మాట్లాడాలని కండక్టర్ చర్యను సమర్థిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.