- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రపతి కులంపై రెచ్చగొట్టే ప్రకటనలు.. మల్లికార్జున్ ఖర్గే, ఢిల్లీ సీఎంపై ఫిర్యాదు
దిశ, డైనమిక్ బ్యూరో: నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవంపై ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతిని కాదని ప్రధాని ప్రార్లమెంట్‌ను ప్రారంభించడంపై మండిపడుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివాసి మహిళ కాబట్టే ప్రభుత్వం ఆమెతో బిల్డింగ్‌ను ప్రారంభించడం లేదని ఆరోపించారు. అయితే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కులం అంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేసినందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఇతర రాజకీయ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
కేజ్రీవాల్, ఖర్గే, ఇతర నేతలు, వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని, వారి రాజకీయ ఉద్దేశాలను నెరవేర్చడానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదుదారు ఆరోపించారు. దీంతో, కేజ్రీవాల్, మల్లిఖార్జున ఖర్గే, ఇతర నేతలపై సెక్షన్ 121,153A,505,34 IPC కింద కేసు నమోదు చేయబడింది. కాగా, నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్, ఆప్, ఇతర ప్రతిపక్షాలు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ సందర్భంగా పలు ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేస్తున్నాయి.