- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Amit Shah: భారతీయుల భద్రత కోసమే సరిహద్దుల్లో కమిటీ
దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో సరిహద్దుల్లో పరిస్థితులపై పర్యవేక్షణకు కేంద్రం కమిటీ వేసింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మీడియాతో మాట్లాడారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు, భారతీయుల భద్రతపై ఈ కమిటీ పర్యవేస్తుందని అన్నారు. బంగ్లా అధికారులతో కమిటీ సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. బీఎస్ఎఫ్ తూర్పు కమాండ్ ఏడీజీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో దక్షిణ బెంగాల్, త్రిపుర విభాగాల బీఎస్ఎఫ్ ఐజీ స్థాయి అధికారులు, ల్యాండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు సభ్యులుగా ఉండనున్నారు. కాగా, బంగ్లాదేశ్‌లో పోలీసులు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు మధ్య గత కొన్నాళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో బంగ్లా అమరవీరుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయం చిచ్చురేపింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశమంతటా ఆందోళనలు చెలరేగాయి. దీంతో ఏకంగా ఆ దేశ ప్రధానే దేశం విడిచి పారిపోయే పరిస్థితి రావడంతో పాటు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు.