- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Maldives : మాల్దీవులతో బలమైన సంబంధాలు కోరుకుంటున్నాం : జైశంకర్
X
దిశ, నేషనల్ బ్యూరో : మాల్దీవులతో స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ ఎల్లప్పుడూ ప్రాధాన్యమిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ఇరుదేశాల ప్రజల ప్రయోజనం కోసం భారత్ - మాల్దీవులు కలిసి నడవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటన కోసం మాల్దీవులకు వెళ్లిన జైశంకర్ శనివారం రోజు ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుతో భేటీ అయ్యారు. ఈసందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించారు.
అనంతరం మాల్దీవుల వాణిజ్య శాఖ మంత్రి మహ్మద్ సయీద్, ఆర్థిక మంత్రి షఫీఖ్, మానిటరీ అథారిటీ గవర్నర్ అహ్మద్ మునావర్‌లతోనూ జైశంకర్ సమావేశమయ్యారు. ఇరుదేశాలు ఆర్థిక, వాణిజ్యపరమైన అంశాల్లో పరస్పర భాగస్వామ్యం, సహకారంతో ముందుకు సాగాల్సిన ఆవశ్యకతపై వారు చర్చించారు.
Advertisement
Next Story