ఢిల్లీ విమానాశ్రయంలో ప్రమాదం.. కూలిన టెర్మినల్‌ పైకప్పు

by Anjali |
ఢిల్లీ విమానాశ్రయంలో ప్రమాదం.. కూలిన టెర్మినల్‌ పైకప్పు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ విమానాశ్రయంలోని పైకప్పు కూలి నలుగురు గాయపడగా.. ఒక వ్యక్తి మృతి చెందారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వర్షాలకు ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్-1లో పైకప్పు కూలిందని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 5 గంటల సమయంలో టెర్మినల్-1 లో ప్రయాణీకులు నిష్క్రమించే ప్రదేశంలో పై కప్పు కూలిందని తెలిపాయి. ఘటన జరిగిన వెంటనే అత్యవసర సహాయ బృందాలు చర్యలు చేపట్టాయని, పలువురు గాయపడ్డారని, వారికి వైద్య సాయం అందించినట్లు తెలిపాయి. వెంటనే టెర్మినల్ 1 నుంచి విమాన సర్వీసులు అన్ని రద్దు చేసినట్లు విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి. ముందు జాగ్రత్తగా చెక్ ఇన్ కౌంటర్లు అన్ని మూసి వేశామని తెలిపాయి. టెర్మినల్- 1 ఘటన జరిగిన ప్రదేశాన్ని నేడు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించనున్నారు. ఘటన ప్రదేశాన్ని పరిశీలించి మంత్రి వివరాలు తెలుసుకొనున్నారు.

Next Story

Most Viewed