- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రియాసి కేసుకు సంబంధించి జమ్మూకశ్మీర్‌లో ఎన్ఐఏ దాడులు
దిశ, నేషనల్ బ్యూరో: యాత్రికులను లక్ష్యంగా చేసుకుని జమ్మూ కశ్మీర్‌లో పర్యాటక బస్సుపై జరిగిన ఉగ్రవాదులు దాడి కేసులో ఎన్ఐఏ ఆదివారం జమ్మూకశ్మీర్ రాజౌరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఉగ్రవాదులు, ఓవర్‌గ్రౌండ్ వర్కర్ల (ఓజీడబ్ల్యూ) మధ్య సంబంధాలను రుజువు చేసే పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. రియాసి జిల్లాలోని పౌని ప్రాంతంలో జూన్ 9న సాయంత్రం శివ్ ఖోరీ నుంచి కత్రాకు వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బస్సు లోయలో పడిపోవడంతో ఒక చిన్నారితో పాటు తొమ్మిది మంది మరణించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జూన్ 15న ఎన్ఐఏ ఈ కేసును టేకోవర్ చేసింది. ఉగ్రవాదులు, ఓజీడబ్ల్యూలతో సంబంధం ఉన్న ఐదు చోట్ల సోదాలు నిర్వహించినట్టు ఎన్ఐఏ వెల్లడించింది. అరెస్ట్ అయిన నిందితుడు హకమ్‌ఖా అలియాస్ హకిన్ దిన్ ఈ లొకేషన్‌ల గురించి చెప్పినట్టు ఎన్ఐఏ పేర్కొంది. హకమ్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, సరుకులు, ఆహారం అందించినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.