కోలకతా మర్డర్ కేసు.. మరో ఇద్దరికి లై డిటెక్టర్ టెస్ట్

by M.Rajitha |
కోలకతా మర్డర్ కేసు.. మరో ఇద్దరికి లై డిటెక్టర్ టెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోలకతా ట్రైనీ వైద్యురాలి మర్డర్ కేసులో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరు అనుమానితులకు లై డిటెక్టర్ పరీక్షకు అనుమతినిస్తూ ప్రత్యేక కోర్టు అనుమతి జారీ చేసింది. ఘటన జరిగిన 20 రోజుల నుండి ఈ కేసు పలు మలుపులు తిరుగుతూ.. అనేక సంచలనాలకు కేంద్ర బిందువైంది. కోలకతా హైకోర్ట్ ఈ కేసును సీబీఐకి అప్పగించగా.. సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా విచారణకు తీసుకుంది. ఇక ఈ కేసులో ఘటన జరిగిన స్థలం.. ఆర్జీ మెడికల్ కాలేజీలోని పలువురు వైద్యులే కాక, కాలేజీ ప్రిన్సిపాల్ ను అదుపులోకి తీసుకొని సీబీఐ విచారిస్తోంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ తోపాటు, పలువురి డాక్టర్లకు, ప్రిన్సిపాల్ కు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించింది. కాగా నేడు ఆర్జీ మెడికల్ కాలేజీలో ఘటన జరిగిన రాత్రి విధుల్లో ఉన్న ఇద్దరు ప్రైవేట్ గార్డ్స్ కు కూడా లై డిటెక్టర్ పరీక్షలను, కోర్టు అనుమతితో సీబీఐ పూర్తి చేసింది. ఇప్పటి వరకు ఈ కేసులో 10 మంది లై డిటెక్టర్ పరీక్షలు ఎదుర్కొన్నారు. ఈ కేసు సెప్టెంబర్ 2న మరోసారి సుప్రీం కోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో సీబీఐ తన దర్యాప్తు ముమ్మరం చేసింది.

Next Story

Most Viewed