- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత ఫిషింగ్ బోట్ నుంచి 173 కిలోల మాదకద్రవ్యాల స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్
దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసీజీ) సోమవారం గుజరాత్ తీరంలో భారత ఫిషింగ్ బోట్ నుంచి 173 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఓడలోని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఐసీజీ, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) సముద్రంలో నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో చేపల పడవను పట్టుకున్నట్టు కోస్ట్ గార్డ్ చెప్పారు. అంతకుముందు రోజు ఐసీజీ, ఏటీఎస్, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్త ఆపరేషన్‌లో 14 మంది సిబ్బందితో కూడిన పాకిస్తాన్ బోటు నుంచి రూ. 600 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అధికారిక సమాచారం ప్రకారం, సోమవారం ఉమ్మడి ఆపరేషన్‌లో ఇద్దరు భారతీయులతో పాటు మొత్తం 173 కిలోల హషీష్(గంజాయి నుంచి సేకరించినది) పట్టుబడింది. గత నెలలోనూఉ కోస్ట్ గార్డ్, ఎన్‌సీబీ, ఏటీఎస్ సంయుక్తంగా గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరంలో రూ. 400 కోట్ల విలువైన మెథాంఫెటమైన్ అనే అత్యంత సైకో-స్టిమ్యులెంట్ డ్రగ్‌ను, ఆరుగురు పాకిస్తాన్ సిబ్బందిని తీసుకువెళుతున్న పడవను పట్టుకున్నాయని అధికారులు పేర్కొన్నారు.