- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటకలో సంకీర్ణం! ప్రీ పోల్ సర్వే అంచనా ఇదే..!
దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే నెలలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పు తప్పదని, సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన రాజకీయ పరిశోధక సంస్థ పీపుల్స్ పల్స్ స్పష్టం చేసింది. సౌత్ ఫస్ట్ అనే సంస్థతో కలిసి నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్ లార్జ్ పార్టీగా అవతరించనుందని అంచనా వేసింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 10 మధ్య 56 అసెంబ్లీ నియోజక వర్గాలలోని 280 పోలింగ్ స్టేషన్‌ల పరిధిలో ఈ సర్వేను నిర్వహించి ప్రజాభిప్రాయం సేకరించారు.
ఈ సర్వే ప్రకారం కర్ణాటకలో మరోసారి హంగ్ అసెంబ్లీ తప్పదని, కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సొంతం చేసుకున్నప్పటికీ స్పష్టమైన మెజార్టీ ఆ పార్టీకి రాదని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ 98 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉందని ఈ పార్టీ సీట్ల రేంజ్ 95 నుంచి 105 మధ్య ఉంటుందని తెలిపింది. ఇక 92 స్థానాలతో బీజేపీ రెండో స్థానంలో నిలువగా ఈ పార్టీ 90-100 మధ్యలో సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. జేడీఎస్ 27 స్థానాలకే పరిమితం అవుతుందని ఈ పార్టీ రేజ్ 25-30 సీట్ల మధ్య ఉంటుందని తెలిపింది. ఇతరులు 1 లేదా రెండు సీట్లలో గెలిచే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
కేజ్రీవాల్ ఆశలు గల్లంతే!
ఈ సర్వేలో 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో మూడు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లు 113 మార్కును దాటలేవని అంచనా వేసింది. దీంతో జేడీఎస్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి స్థాపించిన కొత్త పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష(కేఆర్ పిపి) 1 నుంచి 2 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేయగా ఇటీవలే జాతీయ పార్టీగా అవతరించిన ఆమ్ ఆద్మీ ఆశలు గల్లంతు కావడం ఖాయం అని ఈ సర్వేలో తేలింది. కర్ణాటకలో ఎంఐఎం, ఏస్ డీపీఐ, ఆప్ పార్టీలు ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని అంచనా వేసింది.
గత నెలలో పీపుల్స్ పల్స్ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలే కాంగ్రెస్‌కు 93-103 మధ్య, బీజేపీకి 83-93 మధ్య, జేడీఎస్‌కు 33-43 మధ్య, ఇతర చిన్నాచితక పార్టీలు నాలుగు సీట్ల వరకు గెలవొచ్చని అంచనా వేసింది. ఈ ఏడాది జనవరిలో సౌత్ ఫస్ట్ నిర్వహించిన పోల్ లో కాంగ్రెస్ 101 సీట్లు, బీజేపీ 91 సీట్లు గెలుస్తుందని అంచనా వేయగా గడిచిన రెండు నెలల నుంచి ఓట్ల శాతంలో కాంగ్రెస్ స్వల్పంగా లాభపడగా, కొన్ని స్థానాల్లో మాత్రం ఆధిక్యాన్ని కోల్పోయినట్లు అంచనా వేశారు.
సిద్ధరామయ్య ఓకే..
తాజాగా నిర్వహించిన ప్రీ పోల్‌లో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య వైపే ఓటర్లు ఆసక్తి చూపుతున్నట్లు తేలింది. 32 శాతం మంది సిద్ధరామయ్యను సీఎంగా ఎంచుకోగా బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పను సీఎంగా 25 శాతం మంది అంగీకరించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకి 20 శాతం మంది జై కొట్టగా జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామిని 18 శాతం మంది ముఖ్యమంత్రిగా అంగీకరించారు. ప్రస్తుతం ఉన్న బొమ్మై ప్రభుత్వం పని తీరుపై 17 శాతం మంది బాగుంది అని 48 శాతం మంది బాగోలేదని మరో 30 శాతం మంది యావరేజ్‌గా ఉందని తెలిపారు. ఏమీ చెప్పలేమని మరో 5 శాతం మంది చెప్పినట్లు ఈ సర్వే పేర్కొంది.
ఓటు షేరింగ్
హోరాహోరీగా సాగబోతున్న కర్ణాటక ఎన్నికల్లో ఓటు షేరింగ్ గణాంకాలు ఆకస్తిని రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 41 శాతం ఓటు షేరింగ్ చేసుకోగా 36 శాతంతో బీజేపీ, ఆ తర్వాత జేడీఎస్ 16 శాతం ఇతర పార్టీలు 7 శాతం ఓటు షేరింగ్ అవుతుందని తాజా సర్వే వెల్లడించింది. జెండర్ వైజ్ గా ఓట్ షేరింగ్ చూస్తే కాంగ్రెస్ పార్టీకి పురుషులు 42 శాతం మంది మొగ్గు చూపగా బీజేపీ వైపు 37 శాతం జేడీఎస్ కు 16, ఇతరులకు 5 శాతం మంది ఓటర్లు మొగ్గు చూపారు. ఇక మహిళలు 40 శాతం కాంగ్రెస్ వైపు ఆసక్తి కనబరిస్తే బీజేపీ వైపు 35 శాతం, జేడీఎస్ 16,ఇతర పార్టీల వైపు 9 శాతం మంది ఆసక్తి చూపించినట్లు వెల్లడైంది.
అర్బన్‌లో బీజేపీ పట్టు
ఈ ఎన్నికల్లో అధికార బీజేపీకి అర్బన్‌లో పట్టు ఉందని తాజా సర్వేలో వెల్లడైంది. అర్బన్ ఏరియాలో బీజేపీ వైపు 42 శాతం ఓటర్లు ఆసక్తి చూపితే కాంగ్రెస్ కు 40 శాతం మంది, జేడీఎస్ కు 12, ఇతరులకు 6 శాతం ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టం అయింది. ఇక రూరల్ ఓటర్లు కాంగ్రెస్ వైపు 42 శాతం మంది మొగ్గు చూపుతున్నట్లు వెల్లడి కాగా బీజేపీ వైపు 30, జేడీఎస్ వైపు 20, ఇతరుల వైపు 8 శాతం మంది ఆసక్తి చూపుతున్నట్లు అంచనా అంచానా వేసింది.
Read more: