Cm yogi: పోలీసు ఉద్యోగాల్లో 20 శాతం మంది మహిళల నిమాయకం.. యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్

by vinod kumar |
Cm yogi: పోలీసు ఉద్యోగాల్లో 20 శాతం మంది మహిళల నిమాయకం.. యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ పోలీసుల్లో 20 శాతం మంది మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సీఎం యోగీ ఆధిత్యనాథ్ తెలిపారు. 60 వేల పోలీసు ఉద్యోగాల ఖాళీల భర్తీకి పరీక్ష నిర్వహించబోతున్నామని, అందులో 20 శాతం మహిళలతో భర్తీ చేస్తామని వెల్లడించారు. వేధింపులకు పాల్పడేవారిని ఈ మహిళలు సమర్థవంతంగా ఎదుర్కొంటారని చెప్పారు. అంబేద్కర్ నగర్‌లో శనివారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఏడేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌ను భారత్‌ చీకటి ప్రదేశంగా భావించేవారని..కానీ నేడు యూపీ ఉజ్వలంగా మారిందని కొనియాడారు. అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో ఉందని చెప్పారు. గతంలో రాష్ట్రంలో అల్లర్లు, అరాచకాలు ఉండేవని ఇప్పుడు వాటి ప్రస్తావన తీసుకురావడానికి కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చామన్నారు. పెట్టుబడులకు సైతం రాష్ట్రం గమ్యస్థానంగా మారిందన్నారు. శాంతి భద్రతల పరిస్థితి సైతం మెరుగ్గా ఉందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed