తమిళనాడులో సీఏఏను అమలు చేయం: సీఎం స్టాలిన్

by Harish |   ( Updated:2024-03-12 09:39:52.0  )
తమిళనాడులో సీఏఏను అమలు చేయం: సీఎం స్టాలిన్
X

దిశ, నేషనల్ బ్యూరో: వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (CAA)ను కేంద్రం సోమవారం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం తమిళనాడులో సీఏఏ చట్టాన్ని ఎట్టిపరిస్థితుల్లోను అమల్లోకి తీసుకురాదని అన్నారు. పౌరసత్వ (సవరణ) చట్టం పార్లమెంటులో ఆమోదం పొందిన నాలుగు సంవత్సరాల తర్వాత లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ దీనిని అమల్లోకి తెచ్చారు. ఇలా చేయడం ద్వారా ప్రధాని రాజకీయ ప్రయోజనాలు పొందవచ్చని చూస్తున్నారు. దీని వల్ల భారత ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. సీఏఏ వల్ల ఎటువంటి ఉపయోగం లేదా ప్రయోజనాలు ఉండవు, ఈ చట్టం పూర్తిగా అసమంజసమైనది. దాని నిబంధనలు భారత రాజ్యాంగం పునాది నిర్మాణానికి విరుద్ధంగా ఉన్నాయి. ఇది బహుళత్వం, లౌకికవాద విలువలను బలహీనపరుస్తుంది, అందుకే తమిళనాడులో CAAని అమలు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ఎటువంటి అవకాశం ఇవ్వదని స్టాలిన్ అధికారిక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed