Chennai Rains: చెన్నైలో కుండపోత.. ప్రజలకు సీఎం హెచ్చరిక

by Rani Yarlagadda |
Chennai Rains: చెన్నైలో కుండపోత.. ప్రజలకు సీఎం హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: ఫెంగల్ తుపాను (Fengal Cyclone) ప్రభావం చెన్నైపై తీవ్రంగా కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రానికి పుదుచ్చేరి - తమిళనాడు మధ్య తుపాను తీరం దాటనుండగా.. చెన్నై సహా.. నార్త్ తమిళనాడు జిల్లాల్లో (North Tamilnadu Districts) కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు చెన్నైలోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. వర్షాల కారణంగా చెన్నై ఎయిర్ పోర్టు (Chennai Airport)ను మూసివేశారు. సాయంత్రం 5 గంటల వరకూ ఎయిర్ పోర్టు మూసే ఉంటుందని అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

తీరందాటే సమయంలో తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వాతావణశాఖ అంచనా వేసింది. భీకర గాలులతో కూడిన అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో.. తమిళనాడు సర్కార్ అప్రమత్తమైంది. సీఎం స్టాలిన్ (CM Stalin).. ఫెంగల్ తుపానుపై సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చెన్నై సహా 6 జిల్లాల్లో తుపాన్ తీవ్ర ప్రభావం చూపుతుందని ఐఎండీ చెప్పడంతో.. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. సాయంత్రానికి చెన్నైలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు ఎప్పటికప్పుడు అన్నం, నీళ్లు, పాలు , పండ్లు వంటివి అందించాలని సీఎం స్టాలిన్ అధికారుల్ని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed