ఇండియా కూటమి నుండి బయటకు రావడానికి కారణం అదే.. ఎట్టకేలకు మ్యాటర్ రివీల్ చేసిన CM మమత

by Satheesh |   ( Updated:2024-02-02 14:47:21.0  )
ఇండియా కూటమి నుండి బయటకు రావడానికి కారణం అదే.. ఎట్టకేలకు మ్యాటర్ రివీల్ చేసిన CM మమత
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పడ్డ ఇండియా కూటమిలో విభేదాలు తలెత్తాయి. సీట్ల పంపకాల విషయంలో తేడాలు రావడంతో పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఇండియా కూటమిలో అనుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌తో పొసగక కూటమిలో కీలక పార్టీలైన తృణమాల్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కూటమి నుండి వైదొలిగి.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండియా కూటమి నుండి బయటకు రావడానికి గల కారణాలను వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ బయటపెట్టారు. శుక్రవారం ఓ సభలో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి రెండు ఎంపీ సీట్లు ఇస్తామని ప్రతిపాదించానని తెలిపారు.

కానీ కాంగ్రెస్ రెండు కంటే ఎక్కువ సీట్లు కావాలని కోరిందన్నారు. బలం లేకున్నప్పటికీ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు అడగటం వల్లే పొత్తు కుదరలేదని.. అందుకే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమితో కాకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నామని దీదీ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత భావసారూప్య పార్టీలతో చర్చిస్తానని తెలిపారు. ఎన్నికల తర్వాత తమతో కలిసొచ్చే భావసారూప్య పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని దీదీ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా గెలవడం కష్టమేనని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఉంటే మిగిలిన చోట్ల బీజేపీని ఓడించాలని సవాల్ విసిరారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీని ఓడించాలని సూచించారు.

Read More..

కేంద్ర బడ్జెట్‌పై ప్రియాంకా గాంధీ విమర్శలు

Advertisement

Next Story

Most Viewed