- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఢిల్లీలో హైటెన్షన్.. CM కేజ్రీవాల్ ఫోన్ సీజ్ చేసిన ఈడీ అధికారులు
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో హైటెన్షన్ వావరణం చోటుచేసుకుంది. సీఎం కేజ్రీవాల్ నివాసానికి వచ్చే అన్ని దారులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మూసివేశారు. అంతేకాదు.. ఈడీ కార్యాలయానికి వెళ్లేందుకు కేజ్రీవాల్ నిరాకరించడంతో మరో అధికారుల బృందం ఆయన నివాసానికి చేరుకుంది. తనను ఇంట్లోనే విచారించాలని అధికారులను సీఎం కేజ్రీవాల్ రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఆయన ఫోన్‌ను కూడా సీజ్ చేసినట్లు సమాచారం. మరోవైపు కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం ఖాయం అనే వార్తలు విస్తృతం కావడంతో ఆయన నివాసం వద్దకు భారీగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో కేజ్రీవాల్ ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఢిల్లీ సీఎం ఇంటికి ఈడీ అధికారుల బృందం వెళ్లడంతో అక్కడ భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బలగాలను భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.