- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఓ బోగస్: సీఎం కేజ్రీవాల్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం ఓ బోగస్ కామెంట్ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దీన్ని ఒక స్కామ్‌గా వర్ణిస్తున్న ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చివరకు తగిన ఆధారాలను స్పెషల్ కోర్టులో చూపించలేకపోయిందని, రౌస్ ఎవెన్యూ కోర్టు గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషి బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. గోవా ఎన్నికల ప్రచారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ సుమారు రూ. 100 కోట్లను ఖర్చు చేసిందని, ఈ డబ్బంతా లిక్కర్ స్కామ్‌లో భాగంగా సౌత్ గ్రూపు నుంచి వచ్చిందంటూ ఈడీ ఆరోపించిందని, చార్జిషీట్లలో పేర్కొన్నదని, కానీ చివరకు రూ. 19 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు స్పెషల్ కోర్టు వ్యాఖ్యానించిందని, ఇది తమ పార్టీ నిజాయితీకి ఇచ్చిన సర్టిఫికెట్ అని అన్నారు.
మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా పలువురిని విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇచ్చి వారిని ఈడీ అధికారులు శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించారు. ఈ కారణంగానే ఒకరికి వినికిడి శక్తి పోయిందని గుర్తుచేశారు. ఇదే వియాన్ని చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖలో తాను పేర్కొన్నానని ఢిల్లీలో సోమవారం మీడియాతో వ్యాఖ్యానించారు. సౌత్ గ్రూపు నుంచి రూ. 100 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్లు ఈడీ ఆరోపించినా దాన్ని ధృవీకరించే తీరులో ఒక్క సాక్ష్యాన్ని కూడా కోర్టుకు సమర్పించలేకపోయిందని గుర్తుచేశారు. ఆ డబ్బును అందుకున్నది గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషి అని పేర్కొన్నా చివరకు వారిద్దరికీ స్పెషల్ కోర్టు బెయిల్ ఇచ్చిందని గుర్తుచేశారు.
మరోవైపు ఢిల్లీ మంత్రి ఆతిషి కూడా ఆదివారం మీడియాతో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. ప్రధాని కార్యాలయం నుంచే ఈడీ అధికారులకు చార్జిషీట్ తయారీపై డిక్టేషన్ జరుగతున్నదని ఆరోపించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అనేకమందిని ప్రశ్నించిన ఈడీ అధికారులు భౌతికంగా ఇండ్లలో, ఆఫీసుల్లో సోదాలు కూడా చేశారని, చివరకు ఏమీ పట్టుకోలేకపోయారని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీపై బురదజల్లే తీరులో ఇప్పటివరకు చేసిన కామెంట్లకు, మోపిన అభియోగాలకు ప్రధాని మోడీ, బీజేపీ నాయకులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సౌత్ గ్రూపు నుంచి రూ. 100 కోట్ల కిక్‌బ్యాక్ లాంటి ఎన్నో ఆరోపణలు చేసి చివరకు రూ. 30 కోట్ల దగ్గరకు వచ్చారని, వాటికి కూడా తగిన ఎవిడెన్సులను కోర్టుకు ఈడీ ఆఫీసర్లు ఇవ్వలేకపోయారని ఆమె గుర్తుచేశారు.