Cm Hemant Soren: బీజేపీ సమాజంలో విషాన్ని నింపుతోంది.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్

by vinod kumar |
Cm Hemant Soren: బీజేపీ సమాజంలో విషాన్ని నింపుతోంది.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మతం, కులం, లవ్‌ జిహాద్‌, ఫ్లడ్ జిహాద్‌ పేరుతో బీజేపీ సమాజంలో విషాన్ని వ్యాపింపజేస్తోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇతర వెనుక బడిన తరగతుల రిజర్వేషన్లను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందన్నారు. రాష్ట్రంలోని హజీరీ బాగ్‌లో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు జార్ఖండ్‌ను హ్యాండిల్ చేయలేక అసోం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల నుంచి నాయకులను దిగుమతి చేసుకుంటుందని మండిపడ్డారు. ఈ దిగుమతి చేసుకున్న నేతలు హిందూ, ముస్లింల పేరుతో సమాజంలో విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు.

ఇటీవల ఓ బీజేపీ సీఎం తన రాష్ట్రం ఎదుర్కొంటున్న వరదలకు ఫ్లడ్ జిహాద్ అని పేరు పెట్టారని గుర్తు చేశారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గిరిజనులు, దళితుల రిజర్వేషన్లను లాక్కునే కుట్ర జరుగుతోందని, దీనికి నిరసనగా బుధవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు. దేశంలోని గిరిజనులు, దళితులు, ఓబీసీలు, మైనారిటీ ప్రజల హక్కులను హరించడాని కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. ‘దేశంలోనే వెనుకబడిన రాష్ట్రాల్లో జార్ఖండ్ ఒకటి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమాజ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. కానీ మా ప్రతిపక్షం సామాజిక భద్రతపై దృష్టి పెట్టకుండా వ్యాపారవేత్తల భద్రతపై దృష్టి సారించింది’ అని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed