CM Dhami: నవంబర్ 9 నాటికి యూసీసీ అమలు.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి

by vinod kumar |
CM Dhami: నవంబర్ 9 నాటికి యూసీసీ అమలు.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి
X

దిశ, నేషనల్ బ్యూరో: నవంబర్ 9 నాటికి రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అమలులోకి వస్తుందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే మత మార్పిడి, అల్లర్ల నియంత్రణ వంటి చట్టాలను అమలు చేశామని చెప్పారు. దీంతో రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పలు చట్టాల అమలుతో క్రమశిక్షణ కలిగిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. త్వరలోనే యూసీసీని కూడా తీసుకొస్తామని తెలిపారు. యూసీసీ బిల్లుకు ఆమోదం తెలపడం రాష్ట్ర చరిత్రలోనే కీలకమైన రోజుగా గుర్తించబడుతుందన్నారు. ఈ బిల్లుతో వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి అంశాల్లో సంస్కరణలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 6న యూసీసీ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed