Shocking: క్షణాల్లోనే రెండో తరగతి విద్యార్థి ప్రాణం పోయింది (వీడియో)

by srinivas |   ( Updated:2024-03-10 12:36:37.0  )
Shocking: క్షణాల్లోనే రెండో తరగతి విద్యార్థి ప్రాణం పోయింది (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా కాలం తర్వాత గుండె పోటు మరణాలు పెరిగిన విషయం తెలిసిందే. అయితే చిన్న పిల్లలకు సైతం గుండో పోటు వస్తోంది. ఉయ్యాట్లో పిల్లలను నుంచి చదువుకుంటున్న విద్యార్థులకు సైతం గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. అందరూ చూస్తుండగానే క్షణాల్లోనే ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో హృదయవిదాకర సంఘటన జరిగింది. హన్స్ వాహిని స్కూల్లో చదువుతున్న రెండో తరగతి విద్యార్థి చంద్రకాత్ గుండెపోటులో మృతి చెందారు. స్కూలు ప్రాంగణంలో ఆడుకుంటూ చంద్రకాంత్ కుప్పకూలిపోయాడు. విద్యార్థిని వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేదు. గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే క్షణాల్లోనే బాలుడు ప్రాణం పోయిన దృశ్యాలు సీసీ పుటేజ్‌లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story