ప్రజలకు న్యాయం చేయడమే న్యాయాధికారుల ఘనకార్యం : సీజేఐ

by Hajipasha |
ప్రజలకు న్యాయం చేయడమే న్యాయాధికారుల ఘనకార్యం : సీజేఐ
X

దిశ, నేషనల్ బ్యూరో : న్యాయాధికారులు సమకాలీన రాజకీయాలకు అతీతంగా గౌరవప్రదంగా హుందాతనంతో నడుచుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. న్యాయస్థానం లోపల, వెలుపల న్యాయాధికారులు ఆదర్శవంతమైన ప్రవర్తన ద్వారా న్యాయవాద వృత్తి గౌరవాన్ని నిలబెట్టాలని కోరారు.‘‘అటార్నీ జనరల్ ఘన కార్యం అనేది ప్రభుత్వం తరఫున కేసులు గెలవడంలో ఉండదు. ప్రజలకు న్యాయం జరిగేలా చూడడంలో ఉంటుంది’’ అని పేర్కొంటూ 1989లో భారతదేశపు అత్యున్నత న్యాయ అధికారిగా నియమితులైన సోలీ సోరాబ్జీకి రాసిన లేఖలో న్యాయనిపుణుడు నాని ఫాల్కివాలా ప్రస్తావించారని సీజేఐ గుర్తుచేశారు. న్యూఢిల్లీలో కామన్వెల్త్ న్యాయవాదులు, సొలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రతినిధులతో పాటు ఆసియా-పసిఫిక్, ఆఫ్రికా, కరేబియన్‌ ప్రాంతాలలో విస్తరించి ఉన్న కామన్‌వెల్త్ దేశాల అటార్నీ జనరల్స్, సొలిసిటర్‌లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed