- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Himachal Pradesh: సీఎం సమోసాలు ఎవరు తీసుకున్నారు?: సీఐడీ దర్యాప్తు
దిశ, నేషనల్ బ్యూరో: ముఖ్యమంత్రి సమోసాను ఎవరు తీసుకున్నారు? ఐదు నక్షత్రాల హోటల్ నుంచి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు కోసం ఆర్డర్ చేసిన సమోసాలు ఆయన ప్లేట్ వద్దకు చేరనేలేవు. ఆయనకు అందించాల్సిన సమోసాలను ఎవరు తీసుకున్నారు? ఈ ప్రశ్నలనే హిమాచల్ ప్రదేశ్ సీఐడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ విషయమై ఐదుగురు పోలీసు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
అక్టోబర్ 21 వ తేదీన సీఎం సుఖ్వింద్ సింగ్ సుక్కు సీఐడీ సైబర్ వింగ్ స్టేషన్ క్వార్టర్స్ ప్రారంభించడానికి వెళ్లారు. అక్కడ సీఐడీ అధికారులు స్నాక్స్ కోసం ప్లాన్ చేశారు. ఫైవ్ స్టార్ హోటల్ నుంచి మూడు బాక్సుల సమోసాలు, కేక్‌లను ఆర్డర్ చేయగా.. ఇద్దరు పోలీసులు వెళ్లి ఆర్డర్ తెచ్చారు. కానీ, ఆ మూడు బాక్సుల్లోని సమోసాలు ఆ కార్యక్రమానికి వచ్చిన సీఎం సుక్కు సిబ్బందికి చేరాయి. కానీ, సీఎం సుక్కుకు అందలేవు. వాస్తవానికి అనారోగ్యం బారిన పడ్డ సీఎం సుక్కు సమోసాలు ఎక్కువ తినడని ఆయన మిత్రవర్గాలు తెలిపాయి. కానీ, వీఐపీ కోసం తెప్పించిన స్నాక్స్ వారికి కాకుండా పక్కదారి పట్టడాన్ని సీఐడీ సీరియస్ తీసుకుంది. దర్యాప్తు చేపడుతున్నది. ఆ రోజున టూరిజం డిపార్ట్‌మెంట్ సిబ్బంది లేకపోవడంతో ఈ పనులు పోలీసు అధికారులు చేయాల్సి వచ్చింది. టూరిజం డిపార్ట్‌మెంట్ సిబ్బందిని సమోసాలు సర్వ్ చేయడంపై ఆరా తీయగా.. సీఎం మెనూలో సమోసాలు లేవని చెప్పినట్టు తెలిసింది. ప్రారంభోత్సవ కార్యక్రమం వద్ద ఉన్న పది మందికి ఆ సమోసాలు ఇవ్వాలని సూచనల మేరకు వాటిని సీఎం సిబ్బందికి పంచినట్టు తెలుస్తున్నది.