Chirag paswan: జార్ఖండ్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ.. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్

by vinod kumar |   ( Updated:2024-09-29 14:20:19.0  )
Chirag paswan: జార్ఖండ్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ.. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ జార్ఖండ్ ఎలక్షన్స్‌లో పోటీ చేస్తుందని తెలిపారు. ఈ విషయంపై ఎన్డీఏ కూటమితో చర్చలు జరుగుతున్నాయని, ఒక వేళ చర్చలు విఫలమైతే ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. సోమవారం ఆయన బొకారాలో మీడియాతో మాట్లాడారు. కూటమితో పొత్తుపై క్లారిటీ రాకపోతే సొంతంగా పోటీ చేయడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత ఇస్తామని చెప్పారు. ఎల్‌జేపీకి ఎక్కడి నుంచైనా ఎన్నికల్లో పోటీ చేసే సత్తా ఉందని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్), ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఎజేఎస్‌యూ) పార్టీల మధ్య పొత్తు ఉంటుందని అసోం సీఎం, జార్ఖండ్‌ ఎన్నికల బీజేపీ కో-ఇన్‌చార్జ్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, ఎల్‌జేపీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed