- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rajendra Pal Gautam: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ మాజీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్(Rajendra Pal Gautam) కాంగ్రెస్(Congress)లో చేరారు. ప్రముఖ దళిత నాయకుడు, సీమాపురి ఎమ్మెల్యే గౌతమ్.. కాంగ్రెస్ సీనియర్లు కేసీ వేణుగోపాల్(KC Venugopal), దేవేందర్ యాదవ్(Devender Yadav), పవన్ ఖేరా(Pawan Khera) సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం ఇండియా కూటమిలో బాగంగా ఆప్, కాంగ్రెస్ మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, దేశరాజధానిలో అధికారాన్ని చేజిక్కించుకోవాలనున్న కాంగ్రెస్ కు ఇది కలిసొచ్చే అంశం అనవచ్చు.
రాజేంద్ర పాల్ గౌతమ్ ఎవరు?
వృత్తిరీత్యా న్యాయవాది అయిన రాజేంద్ర పాల్ గౌతమ్ 2014లో ఆప్ లో చేరారు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly elections.) సీమాపురి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దళిత హక్కుల కోసం రాజేంద్ర పాల్ గౌతమ్ పోరాడారు. ఇకపోతే, 2022 అక్టోబర్ లో సుమారు పదివేల మంది బౌద్ధమతంలోకి మారారు. ఆ కార్యక్రమానికి రాజేంద్ర పాల్ గౌతమ్ హాజరయ్యారు. దీంతో, ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాజేంద్ర పాల్ క్షమాపణలు చెప్పి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు, ఇటీవలే ఆప్ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వర్(Kartar Singh Tanwar), మాజీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్(Raaj Kumar Anand) లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ వరుస ఫిరాయింపులతో ఢిల్లీలో ఆప్ బలహీనపడే అవకాశంఉంది.