జాతీయ అవార్డుల ప్రకటనపై ముఖ్యమంత్రి సీరియస్

by GSrikanth |   ( Updated:2023-08-25 06:28:53.0  )
జాతీయ అవార్డుల ప్రకటనపై ముఖ్యమంత్రి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: 69వ జాతీయ సినిమా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం ఏడు భాషలు పోటీ పడ్డ ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలకు 10 అవార్డులు వచ్చాయి. ఇదిలా ఉండగా.. అవార్డుల ప్రకటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వివాదాస్పద సినిమా అయిన కశ్మీర్ ఫైల్స్‌కు అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జాతీయ అవార్డులు రాజకీయాలను ప్రభావితం చేయకూడదని అన్నారు. ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న చిత్రాలను ఎలా పరిగణలోకి తీసుకుంటారని సీరియస్ అయ్యారు. ఎన్నికల వేళ కావాలనే సినిమా అవార్డులను కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గురువారం ఢిల్లీలో 69వ జాతీయ అవార్డులు -2021 ప్రకటించింది. ఇందులో జాతీయ సమగ్రతా చిత్రంగా ది కశ్మీర్ ఫైల్స్ ఎంపిక అయింది.


Read More: Varun Tej ‘Gaandeevadhari Arjuna’ ట్విట్టర్ రివ్యూ

Advertisement

Next Story