- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chhattisgarh : విషప్రయోగంతో పెద్దపులి మృతి.. సుమోటోగా కేసు నమోదు
దిశ, నేషనల్ బ్యూరో : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో గత వారం విషప్రయోగం జరిగి పెద్దపులి చనిపోయిన ఘటనలో హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ ఘటనలో తదుపరి చర్యలు తీసుకోవడంలో భాగంగా రాష్ట్ర అడిషనల్ చీఫ్ (ఫారెస్ట్ అండ్ క్లైమెట్ చేంజ్)ను వ్యక్తిగతంగా అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది. కొరియా జిల్లాలోని గురు ఘసిదాస్ నేషనల్ పార్క్ సమీపంలోని అడవిలో పులి చనిపోయి కనిపించింది. టైగర్ విసెరా శాంపిల్స్‌ను ఎగ్జామినేషన్ కోసం లాబోరేటరీకి పంపినట్లు అధికారులు తెలిపారు. వార్త కథనాల ఆధారంగా సుమోటో కేసు నమోదు చేసినట్లు జస్టిస్ రమేష్ సిన్హా, జస్టిస్ అమితేంద్ర కిషోర్ ప్రసాద్‌ల బెంచ్ తెలిపింది. పులి చనిపోయిన చోట సగం తిన్న గేదే కళేబరం పడి ఉండటంతో ఇది ప్రతీకార చర్యగా భావిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. వన్యప్రాణుల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేయడానికి 10 రోజుల గడువు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.